PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాట్సాప్ ఫోటో… పోలీస్ స్టేషన్ లో డిష్యూం

1 min read

-బాధితులు ఆసుపత్రి పాలు -పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన గ్రామస్తులు -పగిలిన స్టేషన్ కారు అద్దం -ఇరువురిపై 16 కేసులు నమోదు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: గోటితో పోయే దానికి గొడ్డలి దాక తెచ్చుకున్నారు సమస్య. వాట్సాప్ గ్రూపులో ఫోటో పంపినందుకు పోలీస్ స్టేషన్ దాకా చేరి స్టేషన్ మెట్ల దగ్గరే చితక్కొట్టడంతో ఇద్దరు ఆసుపత్రి పాలు అయిన సంఘటన చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామానికి చెందిన సోమవారం ఉదయం నందికొట్కూరులో వినాయకుడి విగ్రహాలను ఇరు కాలనీ వారు కొన్నారు.అక్కడ వడ్డె మారెన్న గారి శ్రీనివాసులు, బోయ మద్దిలేటి వీరిద్దరూ ఫోటో దిగారు.దిగిన ఫోటోను గ్రామంలో ఉన్న వడ్డే సంఘం గ్రూపులో శ్రీనివాసులు పంపాడు.ఫోటోను గ్రూపులో ఎందుకు పెట్టావని మద్దిలేటి శ్రీనివాసులును బూతులతో తిట్టాడు.తర్వాత మంగళవారం  గ్రామంలో ఉన్న వినాయకుడి దగ్గర ఉ 9:15 ని.కు మాట మాట పెరిగి వాలంటీర్ సంపంగి శివ,వెంకటరమణ వీరిద్దరూ కలిసి శ్రీనివాసులను కొట్టారు. విషయాన్ని తెలుసుకున్న మిడుతూరు ఏఎస్ఐ సుబ్బయ్య అక్కడికి చేరుకొని నీవు స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ రాసి ఇవ్వుపో అని ఏఎస్ఐ శ్రీనివాసులను స్టేషన్ కు పంపించాడు.పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రాస్తుండగా పోలీస్ స్టేషన్ లో మాపైనే కంప్లైంట్ చేస్తావా అంటూ ఇదే గ్రామానికి చెందిన వడ్డే మద్దిలేటి,వడ్డే గోపాల్,వడ్డే మధు,శివమధు, వడ్డే బెబ్బిలి వీరంతా కలిసి శ్రీనివాసులు,తల్లి రవణమ్మ, భార్య మహేశ్వరమ్మ లను పోలీస్ స్టేషన్ లో మెట్ల దగ్గరే  దారుణంగా కొట్టారని గ్రామస్తులు తెలిపారు.స్టేషన్ మెట్ల దగ్గరే శ్రీనివాసులు స్పృహ తప్పి పడిపోయాడు.  అక్కడే ఉన్న స్టేషన్ కారు అద్దం పగిలింది.కొట్టుకుంటూ ఉండగా  పోలీస్ సిబ్బంది విడిపించారు.శ్రీనివాసులు,రవణమ్మకు మిడుతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కొరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి డోన్ కు వస్తున్న సందర్భంగా  కొత్తగా వచ్చిన ఎస్ఐ ఎం.జగన్ మోహన్ మరియు సిబ్బంది బందోబస్తు నిమిత్తం అక్కడికి వెళ్లారు.ముచ్చుమరి ఎస్సై నాగార్జున పోలీస్ స్టేషన్ కు చేరుకొని సిబ్బంది మదన్ గౌడ్,సలాం అక్కడున్న వారందరినీ పంపి వేసి సమస్యను సద్దు మణిగించారు.కేసులు నమోదైన వివరాలు:కుంచపు మద్దిలేటి,బొబ్బిలి,మధు కుమార్,మధు గోపాల్,మధు మోహన్,మధు కృష్ణ,శివ మధు,సంపంగి శివకృష్ణ రామకృష్ణ వెంకటరమణ అను వీరి పైన మరియు వర్గమైన శ్రీనివాసులు,మహేశ్వరి,డి.రాజు,డి.అంజి, మారెమ్మ అను వీరి ఇరువురు పైన కేసులు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపారు.

About Author