PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో ద‌స‌రా సెల‌వులు ఎప్పుడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఏపీలోని పాఠ‌శాల‌ల‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఈ నెల 26 నుంచి ఏపీలో ద‌సరా సెల‌వులు మొద‌లు కానున్నాయి. అదే విధంగా వ‌చ్చే నెల (అక్టోబ‌ర్‌) 6 వ‌ర‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం.. అక్టోబ‌ర్ 7న పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మొత్తంగా 11 రోజుల పాటు పాఠశాల‌ల‌కు ద‌స‌రా సెల‌వులు ఇచ్చారు. ఈ నెల 26 నుంచి ద‌స‌రా సెల‌వులను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌గా… పాఠ‌శాల‌ల‌కు మాత్రం 25న‌నే సెల‌వులు ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే ఈ నెల 25న ఆదివారం కాబ‌ట్టి.

                                                

About Author