ఏపీలో కొత్త జిల్లాల అవతరణ ఎప్పుడంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4 న ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాలు అవతరించబోతున్నాయి. అలాగే ఏప్రిల్ 6న వాలంటీర్ల సేవలకు సత్కారం చేయనున్నారు. ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమం చేపట్టనున్నారు. సీఎం జగన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 26 జిల్లాల ఏర్పాటునకు గానూ వర్చువల్‌గా ఆమోదం తెలిపింది కేబినెట్. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్ విజయవాడ జిల్లాలు అమలులోకి రానున్నాయి.