పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : పదో తరగతి పరీక్షల ఫలితాలు ఒక వారం రోజుల్లోగా విడుదల కానున్నాయి. వీలైతే ఇంకా ముందుగానే ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఇప్పటికే మూల్యాంకనం పూర్తయి.. ఫలితాల వెల్లడికి అవసరమైన ఏర్పాట్లు దాదాపుగా చేశారు. మరోవైపు పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు మాత్రమే ప్రకటిస్తారు. ర్యాంకులు ప్రకటించరు. గతంలో ఉన్న గ్రేడింగ్ పద్ధతికి బదులు మార్కులు మాత్రమే ప్రకటించే విధానాన్ని రెండేళ్ల నుంచీ అమలుచేస్తున్నారు. పరీక్షల ఫలితాలు వెలువరించాక.. విద్యాసంస్థలు, పాఠశాలలు తమ విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయంటూ ప్రకటనలు ఇవ్వకూడదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మార్కుల ఆధారంగా తమ విద్యాసంస్థలో చదివినవారికే మొదటి ర్యాంకు వచ్చిందని, లేకుంటే ఫలానా ర్యాంకు వచ్చిందని ప్రకటనలు ఇవ్వడం కుదరదు. అలా ప్రకటనలిస్తే కనీసం మూడేళ్ల జైలుశిక్ష… గరిష్టంగా ఏడేళ్లవరకు జైలు శిక్ష పడవచ్చని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జారీచేసిన జీవోలో పేర్కొన్నారు.