పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీవరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీవరకు గడువు ఉందని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో జూన్ 21వ తేదీ నుంచి ఆయా సబ్జెక్టుల పరీక్ష తేదీకి ఒక రోజుముందు వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.