రాహుల్ ఏ తండ్రి కుమారుడో ఎప్పుడైన అడిగామా ?
1 min readపల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ నేతృత్వంలో 2016లో జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్‌పై రాహుల్ రుజువులు అడిగారని, కానీ ఆయన ఏ తండ్రి కుమారుడో తాము ఎప్పుడైనా రుజువులు అడిగామా అని హిమంత ప్రశ్నించారు. శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని కిచ్చాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో హిమంత మాట్లాడారు. ‘‘సర్జికల్ స్ట్రయిక్స్‌పై సాక్ష్యాధారాలు కావాలని అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు? పాకిస్థాన్ భూభాగాల్లోకి ప్రవేశించి దాడులు చేశామని మన సైనికులు స్పష్టం చేశారు. సైనికులు చెప్పిందే ఫైనల్’’ అని హిమంత విశ్వశర్మ అన్నారు.