PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చరిత్ర సాక్షాత్కరించిన వేళా..

1 min read

– నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ రాహాత్.

– అట్టహాసంగా  మార్కెట్ కమిటీ చైర్మన్  ప్రమాణ స్వీకారం.

పల్లెవెలుగు  వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్  షేక్ రాహాత్,  వైస్ చైర్మన్ గా  శాతనకోట మొల్ల షరీఫ్ బాష గురువారం వైసీపీ నాయకులు కార్యకర్తల కోలాహలం నడుమ అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లుగా ,ఉస్మాన్ బాష, నాని సాత్విక, శివ మల్లమ్మ, మల్లెపూల శిరీష, గురులోళ్ల సరోజమ్మ, కావాటి రాముడు, పోచ కళ్యాణి , సందేపోగు దావీదు, లక్ష్మీ దేవమ్మ, అబ్దుల్ గపూర్, కేతిరెడ్డి ఆది జగదీష్ రెడ్డి, గుండం పెద్ద పుల్లా రెడ్డి, షేక్ జలీల్ అహమ్మద్, లచే వ్యవసాయ మార్కెట్ కమిటీ మేనేజర్ కృష్ణ నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు.పట్టణంలోని చామండి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రమాణ  స్వీకారం మహోత్సవానికి వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి  సిద్దార్థ రెడ్డి, నంద్యాల  ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వారు మాట్లాడుతూ  50 ఏళ్ల  చరిత్రలో నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మహిళకు కేటాయించడంతో వైసిపి కే  సాధ్యమైందన్నారు.చైర్మన్ పదవి మహిళకు రావడానికి  బైరెడ్డి సిద్దార్థ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ముస్లిం మైనారిటీలకు  40 శాతం  రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని అన్నారు.చట్ట సభల్లో మైనార్టీలకు అవకాశం కల్పించిన చరిత్ర వైఎస్సార్ దే అన్నారు.చైర్మన్ పదవి బాధ్యతతో  కూడుకున్నదని రైతు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు.అనంతరం వైసీపీ కార్యకర్త బ్రహ్మయ్య ఆచారి  చెక్కతో తయారు చేసిన నాగలి ని సిద్దార్థ రెడ్డి కి బహుకరించారు. కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి , పగిడ్యాల జడ్పీటీసీ పుల్యాల దివ్య , జూపాడుబంగ్లా జడ్పీటీసీ పోచ జగదీశ్వర రెడ్డి, కొత్తపల్లి జడ్పీటిసి సోమల సుధాకర్ రెడ్డి, మిడుతూరు జడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, ఎంపీపీ లు మండ్ల మల్లేశ్వరి, మల్లు వెంకటేశ్వరమ్మ , ఎక్కలదేవి సువర్ణమ్మ, సుమలత, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తువ్వా శివ రామ కృష్ణ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు, మున్సిపల్ కౌన్సిలర్లు చిన్న రాజు, నాయబ్, చంద్ర బాష , అబ్దుల్ రావుఫ్, కృష్ణ వేణి, వైసీపీ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి,  ఉస్మాన్ బేగ్, జబ్బార్, రమేష్ రెడ్డి, జాలంగారి నాగన్న , బద్ధుల శ్రీకాంత్,  అబూబక్కర్, మన్సూర్ భాష, వివిధ గ్రామాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author