రైతు ఖాతాలోకి పీఎం కిసాన్ నిధులు ఎప్పుడంటే ?
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 8వ విడత నగదు పంపిణీ మీద రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 8 లోపు ఎప్పుడైనా ఖాతాల్లో జమ చేస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్ నెల మొదటి వారంలో రైతు ఖాతాల్లో డబ్బు జమ కాదని స్పష్టం చేసింది. ఏప్రిల్ నెల చివరి వారం.. అంటే 25 తారీఖు పైన డబ్బు జమ అయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో జమ అవుతాయన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి ద్వార పెట్టుబడి సహాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 6 వేల నగదు రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ 6 వేల రూపాయలు.. మూడు విడతల్లో ..అంటే ఒక్కోసారి 2 వేల రూపాయలు జమ చేస్తారు.