ఉచిత బియ్యం పంపిణీ ఎప్పటి వరకు అంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు అదనపు ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేసే పథకాన్ని మరోసారి పొడిగించింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు మరో ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో పొడిగించిన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత అండగా ఉండి దేశాన్ని బలోపేతం చేసేందుకే పథకాన్ని మరోసారి పొడిగించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు . ఈ పథకం కింద పేదలకు ఒక్కొక్కరికి కేంద్రం నెలకు 5 కిలోలు చొప్పున బియ్యం లేదా గోధుమలను ఉచితంగా పంపిణీ చేస్తోంది.