NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐకాన్ స్టార్ `పుష్ప‌` రిలీజ్ ఎప్పుడంటే ?

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక హీరోహీరోయిన్లుగా తెర‌కెక్కుతోన్న చిత్రం `పుష్ప‌`. సుకుమార్  ఈ సినిమాకి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. సునీల్, అన‌సూయ‌, ప‌హద్ ఫ‌స‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంది. ఈ సినిమా రెండు పార్ట్స్ గా తీసుకురావ‌డానికి ద‌ర్శకుడు సుకుమార్ ప్రయ‌త్నిస్తున్నారు. సినిమా విడుద‌ల పై అభిమానుల్లో గంద‌రగోళం నెల‌కొంది. విడుద‌ల తేదికి సంబంధించి స్పష్టతలేక‌పోవ‌డ‌మే ఇందుకు కారణం. అయితే క్రిస్మస్ కానుక‌గా మొదటి భాగం తీసుకురావాల‌ని ద‌ర్శకుడు ప్ర‌య‌త్నిస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 17న థియేట‌ర్లలో సంద‌డి చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న `పుష్ప‌`.. అన్ని భాషల్లోనూ డిసెంబ‌ర్ 17నే రిలీజ్ కానుంది.

About Author