ఎల్ఐసీ ఐపీవో ఎప్పుడంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ ఎల్ఐసీ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రక్రియను ఆర్థికమంత్రి నిర్మాలసీతారామన్ సమీక్షించారు. ఎల్‌ఐసీ ఇష్యూ మార్చిలోనే మార్కె ట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ఆర్థిక మంత్రి సమీక్ష గురించి తెలిపింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం ఎంత మేరకు తన వాటాలు విక్రయించాలనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఎల్‌ఐసీలో వాటాల కొనుగోలుకు విదేశీ ఇన్వెస్టర్లను కూడా అనుమతించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ ఇష్యూలో వాటాల కొనుగోలుకు ఎఫ్‌పీఐలకు అనుమతి ఉంది. కాని ఎల్‌ఐసీ చట్టంలో విదేశీ ఇన్వెస్టర్లకు వాటాల విక్రయం నిబంధన ఏదీ లేకపోవడం వల్ల సెబీ నిబంధనలకు అనుగుణంగా అందులో మార్పులు చేయాల్సి ఉంది.