థర్డ్ వేవ్ ఎప్పుడు.. ఎస్బీఐ నివేదిక ఏం చెబుతోంది ?
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత్ లో కరోన కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ మూడో దశ ముప్పు తప్పదని ఆరోగ్యరంగ నిపుణలు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఆగస్టు నెలలోనే థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. సెప్టంబర్ నెలలో ఇది గరిష్ఠానికి చేరుకుంటుందని అంచనా వేసింది. కరోన వైరస్ ప్రభావం, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలపై వైరస్ ప్రభావం లాంటి అంశాలను ఎస్బీఐ ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా ‘కోవిడ్19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్ ’ పేరుతో తాజాగా పరిశోధనాత్మక నివేదిక విడుదల చేసింది. దేశంలో కరోన రెండో దశ ప్రభావం అధికంగా ఉందని అంచనా వేసిన ఎస్బీఐ.. మే 7 నాటికి రెండో దశ గరిష్ఠ స్థాయికి చేరుకుందని నివేదికలో పేర్కొంది. జులై రెండో వారానికి రోజూవారీ కేసుల సంఖ్య 10వేలకు తగ్గుతుందని పేర్కొంది. ఆగస్టు రెండో పక్షం నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉందని నివేదికలో ఎస్బీఐ పేర్కొంది.