టిడిపి ప్రభుత్వం రాగానే..బెత్లెహేము తీసుకెళ్లేందుకు కృషి చేస్తా:టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏసుక్రీస్తు పుట్టిన పవిత్ర ప్రదేశం అయినా బెత్లెహేము వెళ్లేందుకు ఆసక్తి కలిగిన పాస్టర్లను, పేద ప్రజలను అక్కడికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ భరత్ అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన నగరంలోని పలు చర్చిలను సందర్శించారు. చర్చిలలో ప్రార్థనలు చేశారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ ఏ మతమైనా ఎదుటి వారికి మంచి చేయాలనే చెబుతుందన్నారు. ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు పుట్టిన బెత్లెహేము వెళ్లాలని ఆశగా ఉంటుందని.. అయితే అది అంత ఈజీ కాదు అన్నారు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే తాను చొరవ తీసుకొని బెత్లెహేము తీసుకులేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి చేస్తే దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. మంచి పనులకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. అలాగే ప్రజలందరి దీవెనలు తనపై ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్టాంటన్ చర్చిలో టిడిపి నేత సురేంద్ర ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు గున్న మార్కు, రామాంజనేయులు, నాగరాజ్ యాదవ్, అబ్బాస్, బొల్లెద్దుల రామకృష్ణ, జూటూరు రవి, రాజ్ కుమార్, ప్రసాదరావు, వినోద్ చౌదరి, శ్రీధర్, యేసు, ఈశ్వర్, సురేంద్ర, శివ, దాస్, పెంచులయ్య, రంజిత్, అజయ్, తదితరులు పాల్గొన్నారు.