NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసీఆర్ జాతీయ పార్టీ ఎప్పుడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. ఆ పార్టీ అధినేతగా దేశవ్యాప్త పర్యటనల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేశారు. పార్టీలోని పది మంది నాయకులు ఈ విమానం కొనుగోలు కోసం విరాళాలు ఇచ్చారు. విరాళాలు ఇచ్చిన నేతల్లో ముగ్గురు ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు కాగా.. ఒకరు నల్లగొండ జిల్లా, మరొకరు కరీంనగర్‌ జిల్లాకు చెందినవారు ఉన్నట్టు సమాచారం. అలాగే.. జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లనూ కేసీఆర్‌ వేగవంతం చేశారు. అందుకు సంబంధించిన పత్రాలపై దసరా పండుగనాడే ఆయన సంతకాలు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు ఆ పత్రాలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు.

                                 

About Author