PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అలగనూరు’ పూర్తయ్యేదెప్పుడు..:గౌరు చరితారెడ్డి

1 min read

సాగు,తాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ కపట ప్రేమ

– గండ్లు పూడ్చలేని ప్రభుత్వం.. బటన్ నొక్కుతున్నామంటూ గొప్పలు

 –  మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి

 పల్లెవెలుగు,వెబ్,మిడుతూరు/గడివేముల: నంద్యాల జిల్లాలోని అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గండిపడిన ప్రాంతాన్ని రైతులు,  నాయకులతో కలిసి పాణ్యం నియోజకవర్గ మాజీ ఎంఎల్ఏ  గౌరు చరితారెడ్డి పరిశీలించారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక అలగనూరు ప్రాజెక్టు కట్ట కుంగిన ప్రాంతంలో  మూడు సంవత్సరాలైనా ఎటువంటి మరమ్మత్తు పనులు చేపట్ట లేదని రైతు ప్రభుత్వం అంటూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.జీవో ఇచ్చి నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆయకట్టుకు వేసవిలో కడపకు తాగునీరు అందించే ఈప్రాజెక్టు వైసిపి పాలకుల నిర్లక్ష్యంతో అటకెక్కిందని ఆరోపించారు. బటన్ నొక్కుతు జగన్మోహన్ రెడ్డి పాలన రైతులకు దగాఖోరు పాలనలా మారిందని గౌరు చరిత ఆరోపించారు.  సాగునీటి ప్రాజెక్టులకు కనీసం మరమ్మత్తు చేయలేని స్థితిలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఏద్దేవా చేశారు. నకిలీ విత్తనాలను రైతు భరోసా కేంద్రాలలోనే అమ్ముతున్నారని రైతులను నట్టేట ముంచుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. జగనన్న కాలనీలు అనువైన స్థలాలు ఇవ్వకుండా పట్టాలిచ్చి టార్గెట్ పూర్తయినట్టు వైసీపీ మంత్రులు నాయకులు జబ్బలు చరుచుకుంటున్నారని ఆరోపించారు.మూడేళ్ల కాలంలో 10 సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో పూర్తిగా విఫలమయ్యారని రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలో వస్తుందని జోస్యం చెప్పారు. మాది రైతు ప్రభుత్వం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం నేను బటన్ నొక్కుతున్నా అంటూ గొప్పలు చెబుతున్నారు. మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోయారని మూడు సంవత్సరములన్నర మీ పాలనలో రైతులు పంటలు వేసుకోవడం లేదు జీవోలు ఇస్తున్నారే తప్పా ఆచరణలో నిధులు ఒక్క పైసా కూడా మంజూరు చేయకపోవడమే గండి పడటానికి కారన మన్నారు.కనీసం ప్రాజెక్టులు గండి పడిన చోట సరి చేయకపోతే ఈప్రభుత్వం రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి  ఉందనేది అర్థం అవుతుందని ఆమె ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.ఇప్పటికైనా స్పందించి అధికారులు ప్రభుత్వం గండిని పొడిచి రైతులకు నీరు అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో మిడుతూరు,గడివేముల మండల కన్వీనర్లు కాతా రమేష్ రెడ్డి,దేశం సత్యనారాయణరెడ్డి, తలముడిపి రంగాల శివరామిరెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కశ్వ శంకర్ రెడ్డి, గడివేముల టిడిపి నాయకులు మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు సీతారామిరెడ్డి పంట రామచంద్రారెడ్డి పంట దిలీప్ రెడ్డి,చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ, దుర్వేసి కృష్ణ యాదవ్,సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ బత్తుల సుభద్రమ్మ,ఒడ్డు లక్ష్మీదేవి,మిడుతూరు వివిధ గ్రామాల నాయకులుసుధాకర్ రెడ్డి,ఇద్రిస్,సంపంగి రవీంద్రబాబు,తమిదల రమణారెడ్డి,చిన్న బాబు సాహెబ్ మరియు తదితర నాయకులు రైతులు పాల్గొన్నారు.

About Author