PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువతకు నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి

1 min read

– ఎవరైనా తనను నేరుగా కలువ వచ్చు.కాటసాని ఓబుల్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం బీరవోలు గ్రామానికి చెందిన బాల్ బాడ్మింటన్ క్రీడాకారులకు 30 వేల రూపాయల విలువచేసే బాల్ బ్యాడ్మింటన్ క్రీడా సామాగ్రిని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి తనయుడు వైయస్సార్ పార్టీ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి , బీరవోలు సర్పంచ్ పల్లె నాగేశ్వర రెడ్డి,బెలుం బాలిరెడ్డి,బెలుమ్ సుబ్బారాయుడు,T.పెద్ద నారాయణ,ఓల్పు శ్రీనివాస రెడ్డి,బేలుం గోపాల్ రెడ్డి,చిన్న నారాయణ బీరవోలు యూత్ సభ్యులు,T.రామాంజనేయులు,o.రామసుబ్బారెడ్డి,L.బాలిరెడ్డి,G.మద్దయ్య,T.రవీంద్ర,C.నాగ రాజు,C.శివరాజు, P. సుదర్శన్రెడ్డి,M.సురేష్,T.సుదర్శన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ తన అన్నగారైన స్వర్గీయ కాటసాని నాగార్జున రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ముఖ్యంగా యువతకు క్రీడల్లో తమ ప్రతిభను వెలికి తీయడానికి తన వంతు సహాయ సహకారాలతో జిల్లా, రాయలసీమ జోనల్ స్థాయి టోర్నమెంట్లను కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. బనగానపల్లె నియోజకవర్గంలో యువత కు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎవరైనా, ఎప్పుడైనా తనను నేరుగా కలవవచ్చని చెప్పారు. బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధిని ఆకాంక్షించే నాయకులు మన కాటసాని రామిరెడ్డి గారు అని అలాంటి నాయకునికి మన యువకులంతా అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మనమంతా వైయస్సార్ పార్టీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి వెంట ఉండి ఆయన విజయానికి కృషి చేయాలని కాటసాని ఓబుల్ రెడ్డి పిలుపునిచ్చారు.

About Author