PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా ఇంటి స్థలాలు ఎక్కడ సారూ..!

1 min read

– జగనన్న కాలనీలో ఇళ్ళు కట్టుకోనివ్వడం లేదు.
– మా ఇంటి స్థలాలు ఎక్కడో చూపించండి.
– అధికారులను వేడుకుంటున్నా లబ్ధిదారులు.
– గోశాల పేరుతో ఆక్రమణకు గురైందంటున్న గ్రామస్తులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గోశాల పేరుతో ఒక ప్రభుద్దుడు ఏకంగా జగనన్న కాలనీ లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి స్థలాలనే కబ్జా చేశాడు. స్థలం తనది అని ఇక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టకుండా అడ్డు పడుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీనితో దాదాపు 20 మంది జగనన్న కాలనీ లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టలేక పోతున్నారు. ఇంటి నిర్మాణానికి ఇంటి పునాదులు తీసుకోవాలని వెళ్లిన లబ్ధిదారులను భయబ్రాంతులకు గురి చేస్తూ అడ్డుకుంటున్నా సంఘటన నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది.గ్రామానికి చెందిన ఆవుల శ్రీనివాసులు గోశాల పేరుతో ప్రభుత్వం జగనన్న కాలనీకి లబ్ధిదారులకు కేటాయించిన 1.50 ఎకరా స్థలాన్ని కబ్జా చేశాడు. తమకు కేటాయించిన ఇంటి స్థలాలు కబ్జా కు గురికావడంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారు.తమకు ఇంటి స్థలాలు చూపించాలని అధికారులకు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదు.ఆవుల శ్రీనివాసులు నుంచి తమ స్థలాలను ఇప్పించాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు . బిజినవేముల గ్రామ సర్వే నెంబర్ 410 లో ప్రభుత్వం జగనన్న కాలనీలో 154 మందికి ఇంటి స్థలం కేటాయించి లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేశారు. దాదాపు 80 మంది ఇంటి నిర్మాణాలు చేపట్టారు. కొందరివి పునాదుల దశలో ఉండగా 20 మందికి ఇంటి స్థలం ఎక్కడో కూడా అధికారులు చూపలేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు . లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలో ఆవుల శ్రీను అను వ్యక్తి అక్రమంగా అక్రమించుకున్నారని పశువుల కోసం గడ్డివాము వేసుకున్నారన్నారు . లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి స్థలాలు నాకు చెందినవి అంటూ ఇంటి నిర్మాణాలను అడ్డుకుంటున్నాడని లబ్ధిదారులు పేర్కొంటున్నారు .అధికారులు స్పందించి అతనిపైన చర్యలు తీసుకోవాలని, జగనన్న లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో శ్రీరాములు, , అంకాలమ్మ, రాజేశ్వరి, అలియా ఖతున్ , పాతిమ ,పార్వతమ్మ వెంకటలక్ష్మమ్మ, పేదలక్ష్మి. తదితరులు పాల్గొన్నారు.

About Author