2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు ఎంతో గంభీరంగా మీరు మాట్లాడినదంతా ఢాంభికమే అనేందుకు ఎనిమిదేళ్ల మీ పాలనే నిదర్శనంగా కనిపిస్తోంది. మీ అసమర్థ నిర్ణయాలు, అర్థిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా.. ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారు. మీరు తీసుకున్న నోట్ల రద్దు, కరోనా లాక్‌డౌన్ వంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది’’ అని టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ గురువారం ప్రధానికి ఘాటుగా లేఖ రాశారు.