ఇక్కడ 18 లక్షల కోట్ల బంగారం ఉంది ?
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ లాకర్ ఎక్కడుందో తెలుసా? . అందులో ఎంత బంగారం నిల్వ ఉందో అంచనా వేయగలరా?. బంగారానికి ఎందుకంత డిమాండో చెప్పగలరా?. రజనీకాంత్ అరుణాచలం సినిమా గుర్తుందా? అందులో ఒక సీన్ లో రజనీకాంత్ తండ్రి ఒక లాకర్ లో లెక్కలేనంత బంగారాన్ని డబ్బును వరుసగా పేర్చి ఉంటారు. అలాంటి సీన్… నిజజీవితంలో నిజంగా ఉంది. బంగారు ఇటుకలు వరుసగా ఒకదానిమీద మరొకటి పేర్చి ఉంటారు. ఆ బంగారు బ్యాంకు విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. ఈ బంగారం కరిగిస్తే … వందకోట్ల పెళ్లి ఉంగరాలు అవుతాయి. ఇందులోని బంగారు ఇటుకలు వరుసగా పేర్చుకుంటూపోతే 15 కిలోమీటర్ల వరకు ఉంటాయంట. అదెక్కడంటే… బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్. అక్కడ నేళమాళిగల్లో ఉన్న బంగారం చూస్తే మన మతిపోతుంది. ఈ బంగారం దొంగతనం చేయాలంటే కనీసం మూడు రోజులు పడుతుందట. బంగారం అత్యంత తక్కువ సరఫరా ఉన్న లోహం. దీనితో పాటు ప్రజల్లో మంచి డిమాండ్ ఉంది. వివిధ దేశాలు ఇక్కడ తమ బంగారాన్ని దాచుకుంటాయి. ఇంతవరకు ఈ బ్యాంక్ లాకర్ లో దొంగతనం చేయడానికి ఎవరూ ప్రయత్నించలేదు. అంటే ఇక్కడ భద్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.