PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాఢ్ ఫాధ‌ర్ ప్రీరిలీజ్ వేడుక ఎక్క‌డంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. ‘లూసిఫర్’కి రిమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించాడు. తొలిసారి నెరిసిన గడ్డంతో తన వయసుకు తగ్గ పాత్రలో నటించాడు. అంతే కాదు ఈ చిత్రంలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్‌ కూడా కీలక పాత్రలో నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ కు అద్బుత స్పందన వచ్చింది. మరోవైపు చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్రకటించింది. ఈ నెల 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని నిర్ణయించింది. అయితే, హైదరాబాద్ బదులు అనంతపురంను వేదికగా ఎంచుకుని ఆశ్చర్య పరిచింది. ఈ బుధవారం నగరంలోని ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని చిత్ర బృందం తెలిపింది.

                                   

About Author