NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎక్కడ అన్యాయం జ‌రిగినా అన్నగా వ‌స్తా : నారా లోకేష్‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : స‌మాజంలో స్త్రీకి ర‌క్షణ‌గా నిలిచి, గౌర‌వించే త‌త్వాన్ని సొంత కుటుంబం నుంచి అలవాటు చేసే సంప్రదాయానికి ప్రతీక రాఖీ పండుగ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర ప్రజ‌ల‌కు నారా లోకేష్ ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్షలు తెలిపారు. స‌మాజంలో ప్రతి మ‌హిళ‌కు ఓ అన్నగా అండ‌గా నిల‌వ‌డం భార‌తీయ సంస్కృతి మ‌న‌కు నేర్పింద‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవారే మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా మాట్లాడ‌టం మ‌న దుర‌దృష్టమ‌ని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయని అన్నారు. ఎక్కడ ఏ అన్యాయం జ‌రిగినా ఓ అన్నగా స్పందిస్తాన‌ని, రాఖీ పౌర్ణమి సంద‌ర్భంగా ప్రతి చెల్లికి హామీ ఇస్తున్నాన‌ని నారా లోకేష్ తెలిపారు. ఏపీలో ఉన్మాదుల దుశ్చర్యల‌కు బ‌లైపోయిన ప్రతి ఆడ‌బిడ్డకు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం చేస్తాన‌ని తెలిపారు.

About Author