నగరంలో ఎటు వెళ్లినా సమస్యలే: టీజీ భరత్
1 min read
పల్లెవెలుగు: కర్నూలు నగరంలో ఏ వీధికి వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. నగరంలోని 49 వ వార్డులో ఆయన ఇంటింటి పర్యటన చేపట్టి ప్రజలను కలిశారు. తెదేపా భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలు ప్రజలకు అందించి మొదటి విడత మేనిఫెస్టోను వివరించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. వార్డు పర్యటనకు వచ్చిన టిజి భరత్ తో ప్రజలు సమస్యలను మొరపెట్టుకున్నారు. త్రాగునీటి ఇబ్బందులు ఎక్కువయ్యాయని చెప్పారు. సరైన సమయంలో నీరు రావడం లేదన్నారు. డ్రైనేజి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిపాలిస్తానని భరోసా ఇచ్చారు. కర్నూలులో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు సమస్యలే చెబుతున్నారని చెప్పారు. ఒక్కసారి తనని గెలిపిస్తే సమస్యలు లేకుండా పాలిస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు అంతా మంచే జరుగుతుందన్నారు. చంద్రబాబు వస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు విక్రమ్ సింగ్, శంకర్ సింగ్, మన్సూర్ ఆలీఖాన్, లక్ష్మన్న, నరసింహులు, రామమూర్తి, అన్వర్, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.
