PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తారా

1 min read

– విద్యుత్ స్తంభాలను మారుస్తారా
పల్లెవెలుగు, వెబ్ గడివేముల: మండల పరిధిలోని గ్రామాలలో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి కాలం చెల్లిన కనీసం వాటి స్థానం కొత్త స్తంభాలు మార్చండి మహా ప్రభో అని గ్రామస్తులు మొత్తుకుంటున్న విద్యుత్ శాఖ అధికారులకు కనీసం చలనం లేదు ప్రమాదం సంభవించక ముందే ప్రమాదాన్ని అరికట్టాల్సిన విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో కాలం చెల్లిన స్తంభాలను మార్చే ప్రక్రియ మొదలుపెట్టడం లేదు ఏడిఏ సతీష్ కుమార్ మంగళవారం నాడు విద్యుత్ సిబ్బందితో ప్రమాద నివారణకు చర్యలపై అవగాహన కల్పించిన. స్పందన మాత్రం కార్యాలయం దాటి ముందుకు రావడం లేదంటే విద్యుత్ శాఖ అధికారుల మొద్దు నిద్ర కు నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది కనీసం మనిషికి అందనంత ఎత్తులో ఉండాల్సిన ట్రాన్స్ఫార్మర్లు బహిరంగ ప్రదేశాలలో చిన్నపిల్లలకు అందేంత ఎత్తులో ఉండడం విద్యుత్ ప్రమాదాలకు అవకాశం ఉంది ముఖ్యంగా బిలకల గూడూరు గ్రామంలో అస్తవ్యస్తంగా విద్యుత్ తీగలు ఇళ్లపై నుంచి వెళ్తున్నాయి విద్యుత్ అధికారులకు చాలాసార్లు మొరపెట్టుకున్న స్పందించిన దాఖలాలు లేవని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్లు ఎత్తు తక్కువలో ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తక్షణమే అధికారులు స్పందించి చుట్టూ రక్షణ కూడా లేకపోతే కంచె ఏర్పాటు చేయాలని మండల వాసులు కోరుతున్నారు బిల్లులు వసూలు చేసే శ్రద్ధ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారించడానికి దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

About Author