PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరో నాని ఏ కొట్టు లెక్క‌లు లెక్క‌పెట్టారో ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు పై ప్ర‌భుత్వం మీద అస‌హ‌నం వ్య‌క్తం చేసిన హీరోలు నాని, సిద్ధార్థ‌కు మంత్రి పేర్నినాని కౌంట‌ర్ ఇచ్చారు. మాట్లాడేవాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో తెలియదని, సెప్టెంబర్‌లో డిస్ట్రిబ్యూటర్‌లు, ఎగ్జిబిటర్లుతో సమావేశం పెట్టామ‌ని అన్నారు. ఆ రోజే సినిమా హాళ్ల యజమానులు అనుమతులు, ఫైర్‌ ఎన్‌ఓసీ కానీ తీసుకోవడం లేదని చెప్పారు. వీటిని రెన్యువల్‌ చేసుకోమని ఆనాడే చెప్పామని, అయినా అనుమతులు లేకుండా నడిపారని అన్నారు. అనుమతులు తీసుకోని థియేటర్లపైనే చర్యలు తీసుకున్నామ‌ని, ఇందులో ఎవరి మీదనో కక్ష ఎందుకు ఉంటుందని చెప్పారు. హీరో నాని ఏ కిరాణ కొట్టు లెక్క‌లు లెక్క‌పెట్టారో తెలియ‌ద‌ని అన్నారు.

                           

About Author