NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దుస్తులు మార్చుకుంటుండ‌గా.. సెల్ ఫోన్ లో చిత్రీక‌ర‌ణ !

1 min read

పల్లెవెలుగు వెబ్​: హైద‌రాబాద్ లోని జూబ్లి హిల్స్ లో ఓ వ‌స్త్ర దుకాణంలో ఓ యువ‌తి దుస్తులు మార్చుకుంటుండ‌గా ఇద్దరు యువ‌కులు ఆ దృశ్యాల్ని సెల్ ఫోన్ లో చిత్రీక‌రించే ప్రయ‌త్నం చేశారు. ఇది గ‌మ‌నించిన యువ‌తి గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో దుకాణం సిబ్బంది ఆ యువ‌కుల్ని ప‌ట్టుకుని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ లో వీడియోల‌ను డిలీట్ చేశారు. అనంత‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాధిత యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డానికి నిరాక‌రించ‌డంతో సుమోటోగా కేసు న‌మోదు చేసుకున్నారు పోలీసులు. జూబ్లిహిల్స్ రోడ్ నెంబ‌ర్ 36 లో అల్కజార్ మాల్ లో హెచ్ ఎండ్ ఎం స్టోర్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వినియోగ‌దారులకు ర‌క్షణ క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైన స్టోర్ మేనేజ‌ర్ అమ‌న్ సూరి పై కూడ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

About Author