కోవాగ్జిన్ కు డబ్ల్యూ హెచ్వో అనుమతి !
1 min readపల్లెవెలుగు వెబ్:కోవాగ్జిన్ కు డబ్ల్యూ హెచ్వో అనుమతి లభించింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (టీఏజీ) పేర్కొంది. కరోనా టీకాలను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చాలా? వద్దా? అనే విషయాన్ని ప్రతిపాదిస్తుంది. కొవాగ్జిన్‌ను ఈయూఎల్‌కు ప్రతిపాదించాలంటే చివరిసారి రిస్క్ బెనిఫిట్‌ను అంచనా వేయాల్సి ఉంటుందని కాబట్టి అదనపు సమాచారం పంపించాలని గత నెల 26న భారత్ బయోటెక్‌ను కోరింది. టీఏజీ అనుమతిపై ప్రభుత్వం స్పందించింది. అనుమతివ్వడం అంటే దానర్థం 18 ఏళ్లు, ఆపై బడిన వారికేనని, చిన్న పిల్లల వినియోగానికి కాదని పేర్కొంది. పిల్లలకు అనుమతి కోసం ఇంకా దరఖాస్తు చేసుకోలేదన్నారు. కొవాగ్జిన్ టీకా లక్షణాలు కలిగిన కొవిడ్-19పై 77.8 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం రక్షణ కల్పిస్తున్నట్టు క్లినికల్ పరీక్షల్లో నిర్ధారణ అయింది.