చంద్రబాబు ఆస్తుల పై విచారణ కోరడానికి మీరెవరు ?
1 min readపల్లెవెలుగువెబ్ : చంద్రబాబుకు ఆస్తులపై విచారణ జరపాలని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టువేసింది. ఆయన ఆస్తుల గురించి తెలుసుకునేందుకు పశ్నించిన ధర్మాసనం.. దీనిని విచారించాల్సి అవసరం లేదని స్పష్టం చేసింది. వైసీపీ నేత లక్ష్మీ పార్వతికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరపాలని ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ కోరడానికి మీరెవరని లక్ష్మీ పార్వతిని కోర్టు ప్రశ్నించింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందని.. ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలని అడిగింది. తాను ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణినని ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఎన్టీఆర్ సతీమణి అయినంత మాత్రాన.. అది అదనపు అర్హత అవుతుందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.