భారత సంపన్న మహిళ ఎవరంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. గత ఏడాదిలో ఆమె సంపద 54 శాతం వృద్ధి చెంది రూ.84,330 కోట్లకు పెరిగింది. కాగా, ప్రముఖ ఫ్యాషన్ పోర్టల్ నైకా.కామ్ వ్యవస్థాపకురాలు ఫాల్గుణీ నాయర్ స్వయంశక్తితో ఎదిగిన వారి లిస్ట్‌లో అగ్రస్థానం దక్కించుకున్నారు. అంతేకాదు, భారత టాప్-100 సంపన్న మహిళల జాబితాలో ఆమెదే రెండో స్థానం. కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్- హురున్ కలిసి బుధవారం విడుదల చేసిన ఈ లిస్ట్ ప్రకారం.. 59 ఏళ్ల నాయర్ ఆస్తి గత ఏడాది ఏకంగా 963 శాతం ఎగబాకి రూ.57,520 కోట్లకు చేరుకుంది. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఆస్తి గత ఏడాదిలో 21 శాతం తగ్గి రూ.29,030 కోట్లకు పడిపోవడంతో ఆమె ర్యాకింగ్ కూడా 2 నుంచి 3వ స్థానానికి జారుకుంది.