NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘‘హెరాయిన్ బిగ్ బాస్’’ ఎవ‌రు ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : రాష్ట్రంలో వేల కోట్ల రూపాయ‌ల హెరాయిన్ అక్రమ ర‌వాణ వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవ‌రో కేంద్ర నిఘా సంస్థలు తేల్చాల‌ని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. 72 వేల కోట్ల విలువైన హెరాయిన్ రాష్ట్రంలో ప‌ట్టుబ‌డిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలోని పోర్టులు తెలుగు వారి ఆధీనంలో ఉండ‌గా.. రెండేళ్ల నుంచి వాటిని ఇత‌ర రాష్ట్రాల వారికి అప్పగిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆఖ‌రికి నెత్తి మీద జుట్టు కూడ స్మగ్లింగ్ చేస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలోని రేష‌న్ ను త‌క్కువకు కొనుగోలు చేసి.. కాకినాడ పోర్టు నుంచి త‌ర‌లిస్తున్నార‌ని చెప్పారు. దీనిపై మంత్రులు , ముఖ్యమంత్రి స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

About Author