NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాక్ కొత్త అధ్య‌క్షుడు ఎవ‌రంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ -నవాజ్‌ అధ్యక్షుడు, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ పేరును ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్రతిపక్షాలు ఉమ్మడిగా పాక్‌ ప్రధాని పదవికి నామినేట్‌ చేశాయి. రాజకీయ క్రీడలో చివరి బంతి వరకూ గెలుపు కోసం ఆడిన ఇమ్రాన్‌ఖాన్‌.. చివరికి విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో క్లీన్‌బౌల్డ్‌ కావడంతో పదవీచ్యుతుడైన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ప్రధానిని ఎన్నుకునే కార్యక్రమం మొదలైంది. పాక్‌ మాజీ అధ్యక్షుడు, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ సహాధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ.. షెహబాజ్‌ షరీఫ్‌ పేరును నామినేట్‌ చేయగా, ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఈ-ఇన్సాఫ్‌ పార్టీ తన అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ పేరును ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పాక్‌ జాతీయ అసెంబ్లీలో కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు.

                                                       

About Author