NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`మంచు` ఫ్యామిలీని టార్గెట్ చేసిన వ్య‌క్తి ఎవ‌రు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మోహ‌న్ బాబు జ‌న్మ‌దిన వేడుక‌ల సంద‌ర్భంగా మంచు మ‌నోజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌ను ఓ వ్య‌క్తి టార్గెట్ చేశారంటూ చెప్పుకొచ్చారు. ఇంత‌కీ ఎవ‌రా వ్య‌క్తి ?. ఎందుకు టార్గెట్ చేశాడ‌న్న‌ది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌నోజ్ ఇంకా ఏమ‌న్నారంటే ..‘‘జీవిత లక్ష్యం కంటే ముందు.. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయి విలువలు కలిగి ఉండాలి. ఈ విలువలు తెలియకపోతే.. వారి వల్ల పక్కన ఉన్నవాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికలే. పోటీకి ఇద్దరు నిలబడినా.. పోటీ తర్వాత అందరూ ఒక్కటే. కానీ, ఓ వ్యక్తి అన్నయ్యని టార్గెట్ చేస్తూ.. మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఎంతగానో ప్రయత్నించాడు. అందులో భాగంగా మాకు సపోర్ట్ చేస్తున్న.. తనకంటే పెద్దవాళ్లని కూడా కించపరిచేలా దూషించాడు. అప్పుడు నాన్నగారు.. ‘ఆ వ్యక్తిని పట్టించుకోకండి. అతనికి జీవిత లక్ష్యం అంటూ ఏమీ లేదు. అందుకే అలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటాడు..’ అని మంచు మ‌నోజ్ చెప్పారు.

                                              

About Author