క్లబ్ లో రాహుల్ తో ఉన్న మహిళ ఎవరంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్ క్లబ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కనపడ్డ మహిళ చైనా రాయబారి కాదని పలు ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్లు తేల్చాయి. రాహుల్ పక్కన ఉన్న మహిళ చైనా రాయబారి కాదని, సుమ్నియా ఉదాస్ స్నేహితురాలని ఆ పబ్ యాజమాన్యంతో పాటు నేపాల్ జర్నలిస్టులు స్పష్టం చేసినట్లు పలు ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. నైట్ క్లబ్ కు చైనా రాయబారులు ఎవరూ రాలేదని చెప్పాయి. రాహుల్ గాంధీ వెళ్లిన ఆ నైట్ క్లబ్ పేరు ‘లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్’ అని పేర్కొన్నాయి. ఈ నెల 2న రాహుల్ గాంధీ దాదాపు ఐదుగురు స్నేహితులతో కలిసి ఆ క్లబ్‌కు వెళ్లారని, వారిలో చైనా రాయబారి ఎవరూ లేరని ఆ క్లబ్ యాజమాన్యం తెలిపింది. క్లబ్‌లో రాహుల్ గంటన్నర పాటు ఉన్నారని చెప్పింది. ఆ సమయంలో రాహుల్ పక్కన ఉన్న మహిళ నేపాల్ దేశీయురాలని, ఆమె పెళ్లి కూతురి తరఫున విందుకు వచ్చారని ఆ దేశ జర్నలిస్టులు తెలిపినట్లు పలు ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్లు పేర్కొన్నాయి.