కరోన వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి?
1 min read.. ఎవరు వేసుకోకూడదు?
పల్లెవెలుగు వెబ్: కరోన ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రెండోదశ కరోన వేవ్ భారత్ లో అధికంగా ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ కూడ జరుగుతోంది. దీంతో కరోన వ్యాక్సిన్ ఎవరు వేసుకోవాలి.. ఎవరు వేసుకోకూడదు అన్నసందేహం ప్రజల్లో మొదలైంది. ఎవరు వేసుకోకూడదు అన్న అంశం అర్థమైతే.. ఎవరు వేసుకోవచ్చన్నది స్పష్టం అవుతుంది.
- జ్వరం అధికంగా ఉన్నప్పుడు కరోన వ్యాక్సిన్ వేయించుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.
-జ్వరం పూర్తీగా తగ్గిన తర్వాతే వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. - అలర్జీ ఉన్నా కూడ వ్యాక్సిన్ వేయించుకోకూడదు. అది తగ్గిన తర్వాతే వేయించుకోవాలి.
-మొదటి డోస్ తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉంటే.. డాక్టర్ సలహాతోనే రెండో డోస్ తీసుకోవాలి. వైద్యుల సలహా పాటించడం చాలా అవసరం.
-బలహీనమైన వ్యాధినిరోధకత ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోరాదు. - గర్బిణీలు, అవయవమార్పిడి చేసుకున్న వారు కూడ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండటం మంచిది.
-బ్లీడింగ్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.
కరోన వ్యాక్సిన్ తీసుకునే ముందు ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి నియమనిబంధనలు పాటించకుండా కరోన వ్యాక్సిన్ తీసుకోవడం శ్రేయస్కరం కాదు. ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఉన్న..డాక్టర్ల సలహా తీసుకున్నాకే వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం.