PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరంజీవి, బాల‌కృష్ణ ఎవ‌రికి ఓటు వేశారంటే .. !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. సినీ ప్రముఖులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. అగ్ర హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ, ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్ చ‌ర‌ణ్ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఓటు హ‌క్కు వినియోగించుకున్న అనంత‌రం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. తన ఆత్మప్రభోధానుసారం ఓటు వేశాన‌ని చిరంజీవి చెప్పారు. ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వ‌ని.. అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడిగా ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని అనుకోవ‌డంలేద‌ని అన్నారు. ‘మా’ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌క‌పోవ‌డం వారి వ్యక్తిగ‌త అభిప్రాయ‌మ‌న్నారు.
ప్రకాష్ రాజ్, విష్ణు అన్నద‌మ్ములు లాంటివారు : బాల‌య్య
‘మా’ఎన్నిక‌ల్లో పోటీచేస్తున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు అన్నద‌మ్ముల లాంటివార‌ని నంద‌మూరి బాల‌కృష్ణ అన్నారు. ఎవ‌రు బాగా చేస్తారో వారికే ఓటు వేశాన‌ని అన్నారు. ప్రకాశ్ రాజ్, విష్ణు ఇద్దరూ మాట‌లు చెప్పేవారు కాద‌ని, ఇండ‌స్ట్రీకి మేలు చేసేవార‌ని అన్నారు. ఎవ‌రు గెలిచినా వారి వెంట నిల‌బ‌డి ప్రోత్సహిస్తామ‌ని బాల‌కృష్ణ అన్నారు.

About Author