PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుప్పం ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పై పోటీ ఎవ‌రంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కుప్పం ఎన్నిక‌ల్లో పోటీ పై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2024 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పై పోటీ చేసే వైసీపీ అభ్య‌ర్థి పై క్లారిటీ ఇచ్చారు. ‘2024 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 175 స్థానాలకు 175 సాధిస్తుంది. కుప్పంలో పోటీపై ఎల్లో మీడియా.. తమిళ యాక్టర్‌తో మంతనాలు అని వార్తలు రాసింది. 2024లో కుప్పం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భరత్‌ మాత్రమే. గతంలో పలమనేరులో మేము గెలిపించిన వ్యక్తి.. వేరే పార్టీకి పోయి మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వెంకటే గౌడను మరింత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. సీఎం వైఎస్‌ జగన్‌కు మనమంతా ఎప్పుడు అండగా నిలవాలి` అని ప్రజల్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.

                                                  

About Author