NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గెలిచే సత్తా ఉంటే… పొత్తులెందుకు..?

1 min read

చంద్రబాబును ప్రశ్నించిన  ఎమ్మెల్యే శ్రీకాంత్​ రెడ్డి

పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి:చంద్రబాబుకుప్రజల్లో విశ్వాసం ,గెలిచే సత్తా ఉంటే పొత్తులెంధుకని   జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమర నాధ రెడ్డి పేర్కొన్నారు . ఆదివారం రాయచోటిలోని జెడ్ పి చైర్మన్ క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ,ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి తో కలసి ఆకేపాటి అమర నాధ రెడ్డి  మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అమర నాధ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పర్యటనలుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.గతంలో గోదావరి పుష్కరాలలో 29 మంది మృతికి కారణమయ్యారన్నారు. తన ప్రచార ఆర్భాటాల కోసం ఇరుకైన సందుల్లో జనాలును తరలించి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నట్లుగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణకోసం  ప్రజల మృతికి  కారకులయ్యారన్నారు. ప్రజలలో టి డి పి పై విస్వాసం ఉంటే, గెలిచే సత్తా ఉంటే   ఇక పవన్ కళ్యాణ్ తదితర పార్టీలుతో పొత్తులెందుకని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనభై శాతంనకు పైగా ప్రజలు  మద్దతు ఉన్నారన్నారు.ప్రజల ప్రాణాలును కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఇరుకు సందుల్లో సభలు,సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం జి ఓ ఇచ్చిందన్నారు.ఈ జి ఓ తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే కాదని, ఇది అందరికీ వర్తిస్తుందన్నారు. చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని,ఇవే చివరి ఎన్నికలు కావొచ్చునన్నారు. చంద్రబాబు సభలలోని మరణాల పట్ల సంతాపం తెలుపుచున్నామన్నారు.చంద్రబాబు బుద్ధి మార్చుకోవాలని ,సీనియర్ నాయకుడుగా, మాజీ ముఖ్యమంత్రిగా  పేరు నిలబెట్టుకోవాలని అమరనాధ రెడ్డి హితవు పలికారు.

About Author