NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్  వెల్దుర్తి : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం  మండల కేంద్రమైన క్రిష్ణగిరిలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని ప్రారంభించిన ,ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి,నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ, ప్రతి పౌరుడికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా చేకూర్చిన మేలును వివరిస్తూ రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం  “ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి” ( వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమాన్ని ఈరోజు మండల కేంద్రమైన క్రిష్ణగిరి లో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ప్రారంభించారు. ముందుగా క్రిష్ణగిరి గ్రామ సచివాలయం లో గ్రామంలో లబ్ధిపొందిన లబ్ధిదారుల జాబితా ను ప్రదర్శించి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ వెళ్లి మా నమ్మకం నువ్వే జగన్ జెండాను ఆవిష్కరించి, లబ్ధిదారుల ఇంటికి వెళ్లి గత ప్రభుత్వ వైఫల్యాలను నాలుగున్నర సంవత్సరంలో జగనన్న ప్రభుత్వం చేకూర్చిన మేలుని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే   మాట్లాడుతూ, ఈ నాలుగున్నర ఏళ్లలో పరిపాలనా సంస్కర­ణలు, వినూత్న కార్యక్రమాల ద్వారా దేశమంతా ప్రశంసించేలా మన రాష్ట్రం సాధించిన పురోభివృద్ధిని అందరికీ క్షుణ్ణంగా తెలియ­జెప్పేలా అలాగే గత సర్కారుకు – వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని చాటి చెప్పేందుకు గౌరవ సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారని తెలిపారు.జగనన్న పాలనలో జరిగిన మంచిని ప్రజలకు చెప్పేందుకు.. 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చిన విషయాన్ని మేనిఫెస్టో చూపిస్తూ వివరించి, మళ్లీ జగనన్నని సీఎంగా చేసుకోవాలని చెప్పే అద్భుతమైన కార్యక్రమమే వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అని ఎమ్మెల్యే  పేర్కొన్నారుఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

About Author