NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇండ‌స్ట్రీని రాజ‌కీయ‌ నాయ‌కులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?

1 min read

పల్లెవెలుగు వెబ్​: సినిమా పరిశ్రమ‌ను రాజ‌కీయ నాయకులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు ప్రముఖ హీరో సిద్ధార్థ్. వేలాది మంది ఆధార‌ప‌డి జీవిస్తున్న సినిమా ప‌రిశ్రమ‌ను టార్గెట్ చేయ‌డం పైన ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేశారు. సినిమా టికెట్లు, పార్కింగ్ ఫీజుల పై నిర్ణయం తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేద‌ని విమ‌ర్శించారు. వ్యాపారాలు ఎలా చేసుకోవాలో నేర్పాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ప‌న్నులు, సెన్సార్ విష‌యంలో ప్రభుత్వాలు ఏం చెప్పినా వింటామ‌ని, నిర్మాత‌లు.. వారి ఉద్యోగుల‌కు జీవ‌నోపాధి లేకుండా చేయొద్దన్నారు. పేద‌రికం నుంచి వ‌చ్చిన సంప‌న్నులుగా మారిన రాజ‌కీయ నాయ‌కుల్ని ప్రశ్నించ‌గ‌లరా అని అన్నారు. ద‌యచేసి సినిమా ప‌రిశ్రమ‌ను వేధించ‌డం ఆపండంటూ వేడుకున్నారు.

About Author