మంత్రులను మార్చడం ఎందుకు.. జగన్ నే మార్చేస్తే పోలా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : లిక్కర్ స్కామ్‌తో సహా పలు అంశాలపై దూకుడుగా వెళ్తున్న విపక్షాలు.. సీఎం జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులే టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. మంత్రులు, ఇతర నేతల నుంచి ఆ స్థాయిలో విపక్షాల ఆరోపణలకు కౌంటర్‌లు పడడం లేదన్న అసహనం జగన్‌లో ఉంది. విపక్షాల నుంచి వచ్చే ఆరోపణలు ఖండించకపోతే.. మీకెందుకీ మంత్రి పదవులు అని జగన్ సీరియస్ అయ్యారని అవసరమైతే మళ్ళి మంత్రి మండలి ని ప్రక్షాళన చేస్తానని తీవ్ర ఆగ్రహం తో చెప్పారని వైసీపీ వర్గాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుంది.. అయితే ఈ ఇష్యూపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తనదైన స్టైల్లో స్పందించారు. మరోసారి మంత్రులను మారుస్తానని జగన్ అంటున్నారు. అన్నిసార్లు మంత్రులను మార్చటం ఎందుకు? జగన్‌నే మార్చేస్తే సరిపోతుందిగా అంటూ సెటైర్ వేశారు.