PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ పేరు మార్చ‌డం ఎందుకు బంగారూ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ స్పందించారు. పేర్లలో ఏముందని ప్రశ్నించారు. ఓ బ్యారేజి ప్రారంభించి మేకపాటి రాజమోహన్ రెడ్డి కొడుకు పేరు పెట్టారు, అంతకుమించి ఏమీ లేదు అని అన్నారు. ఇక, ఎన్టీ రామారావు గొప్ప నటుడు, పెద్ద మనిషి, మంచి లీడర్ అని, విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని వివరించారు. “ఆ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడం ఎందుకు బంగారూ… ఆయన పేరు మార్చడం వల్ల వైద్య సౌకర్యాలు ఏమన్నా ఎక్కువయ్యాయా! మీ నాన్న పేరు పెట్టుకోవడం ఎందుకు? మీ నాన్న భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ కు చేసిన త్యాగాలు ఏమైనా ఉన్నాయా? ఆయనేమైనా కష్టపడి డాక్టర్ చదివాడా? ` అని ప్ర‌శ్నించారు.

                                                   

About Author