PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌నుషులు మాత్రమే ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జంతువులతో పోలిస్తే మనుషుల జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. చాలా ర‌కాల జంతువుల జీవిత కాలం చాలా త‌క్కువ ఉంటుంది. మ‌నుషులకు మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన ఈ అవ‌కాశం ఎందుకో శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న‌లో తేలింది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని జన్యు శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. సాధారణంగా ఏ జీవి శరీరంలోని జన్యువుల్లో అయినా కాలక్రమంలో పలు ఉత్పరివర్తనాలు (జీన్‌ మ్యుటేషన్స్‌) జరుగుతుంటాయి. ఈ మ్యుటేషన్లు వేగంగా జరిగే జీవుల జీవితకాలం తక్కువగాను.. ఉత్పరివర్తనాలు నెమ్మదిగా జరిగే జీవుల జీవితకాలం ఎక్కువగాను ఉంటుందని.. యూకేలోని వెల్‌కమ్‌ సేంజర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు గుర్తించారు. ఉదాహరణకు మనుషుల జన్యువుల్లో ఏడాదికి సగటున 20 నుంచి 50 ఉత్పరివర్తనాలు జరుగుతుంటాయి. వాటిలో అత్యధికం ఎలాంటి హానీ కలిగించనివే. అతి తక్కువ ఉత్పరివర్తనాలు మాత్రం కేన్సర్‌ వంటివాటికి కారణమవుతుంటాయి. ఈ రహస్యాన్ని తెలుసుకోవడం కోసం వారు 48 మంది మనుషులతోపాటు.. 16 జంతువుల నుంచి సేకరించిన జన్యువులపై విస్తృతంగా పరిశోధనలు జరిపారు.

                                              

About Author