ఉల్లి చేసే మేలు తల్లి కూడ చేయదు అని ఎందుకు అంటారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఉల్లి చేసే మేలు గురించి పుంఖానుపుంఖాలుగా చెబుతారు. వంటకాల్లో ముఖ్యమైన పదార్థంగా పనిచేయడంతో పాటు లాభాలు చాలానే ఉన్నాయి. పట్టుకుచ్చు లాంటి జుట్టు కావాలన్నా, ముఖంపై మొటిమలు, మచ్చలు పోవాలన్నా ఉల్లి దివ్యౌధంలా పనిచేస్తుంది. ఉల్లిలోని పీచు పదార్థం, ఫ్లేవ నాయిడ్లు, క్వెర్సెటిన్ కారణంగా జీర్ణ క్రియకు అద్భుతమైన టానిక్‌గా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం చర్మాన్ని మృదువుగా చేస్తుంది. దీని వల్ల మొటిమలు, చర్మసంబంధ ఇన్పెక్షన్లు తగ్గుతాయి. జుట్టు సంబంధిత సమస్యల ఉపశమనానికి ఉల్లిలోని పోషకాలు బాగా ఉపయోగపడతాయి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అలోవోరా కలిపి కొబ్బరి నూనెలో మరిగించాలి. దీన్ని గోరువెచ్చగా మాడుకు మర్దనా చేసుకోవాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే, హెయిర్‌ఫాల్ తగ్గుతుంది. ఉల్లిలో ఉండే కొల్లాజెన్ , సల్ఫర్ మూలకం తలభాగంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా తలలో మూసుకుపోయిన రంధ్రాలు తిరిగి తెరుచుకుని జుట్టు బలంగా ఎదుగుతుంది.