PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వంట నూనె ధ‌ర ఎందుకు పెరుగుతోంది.. త‌గ్గాలంటే ?

1 min read

పల్లెవెలుగు వెబ్​: దేశీయంగా వంట నూనెల వినియోగం ఏటా పెరుగుతోంది. ఫ‌లితంగా విదేశాల నుంచి దిగుమ‌తులు పెరుగుతున్నాయి. 1992లో 3 శాతం దిగుమ‌తులు ఉంటే .. ఇప్పుడు 70 శాతం దిగుమతుల పైనే ఆధార‌ప‌డుతున్నాం. దేశీయంగా నూనె గింజ‌ల పంట‌ను పండించ‌డం రైతులు త‌గ్గించేశారు. పండిన పంట‌కు గిట్టుబాట ధ‌ర రాక‌పోవ‌డం కార‌ణంగా క్రమంగా నూనె గింజ‌ల పంట నుంచి ఇత‌ర పంట‌ల వైపు రైతు మొగ్గుచూపుతున్నాడు. దీంతో ఏటా వంట నూనె దిగుమ‌తి పెరుగుతోంది. ఫ‌లితంగా ప్రభుత్వం పై భారం ప‌డుతోంది. మ‌న దేశం వంట నూనెల్లో స్వయం స‌మృద్ధి సాధించాలంటే క‌నీసం 15 నుంచి 20 ఏళ్లు ప‌డుతుంద‌ని ప్రముఖ పారిశ్రామికవేత్త బివి. మెహ‌తా అభిప్రాయ‌ప‌డ్డారు. అది కూడ ప్రభుత్వ విధానాలు దేశీయంగా పండించే రైతుల‌కు అనుకూలంగా ఉంటేనే  సాధ్యమ‌వుతుంద‌ని చెప్పారు. ప్రభుత్వమే గిట్టుబాటు ధ‌ర క‌ల్పించి రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తే త‌ప్ప నూనె గింజ‌ల పంట విస్తీర్ణాన్ని పెంచ‌లేమ‌ని తెలిపారు.

About Author