PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాట్సాప్ ఎందుకు ఆగిందంటే ?

1 min read

పల్లెవెలుగువెబ్ : మంగళవారం వాట్సప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు రెండు గంటల పాటు కోట్లాది మంది వినియోగదారుల యాప్, వెబ్ క్లయింట్‌లు పనిచేయలేదు. దీనివల్ల వినియోగదారులు మెసేజ్లను పంపలేకపోయారు. ఆడియో, వీడియో కాల్స్ కూడా కనెక్ట్ కాలేదు. రెండు గంటల అంతరాయం తర్వాత వాట్సప్ సేవలు పునరుద్ధరించడంతో వినియోగదారులకు ఉపశమనం కలిగింది. కాగా, వాట్సప్ సేవలకు ఎందుకు అంతరాయం కలిగిందో దాని యాజమాన్యం అయిన మెటా వివరణ ఇచ్చింది. మెటా ప్రతినిధి ఒకరు ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ.. తమ వైపు నుంచి సాంకేతిక లోపం కారణంగా వాట్సప్ కొద్దిసేపు ఆగిపోయిందని తెలిపారు. ఆ సాంకేతిక లోపానికి కారణం ఏమిటనే విషయాన్ని మాత్రం మెటా వెల్లడించలేదు.

About Author