లతా మంగేష్కర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : లతా మంగేష్కర్ వ్యక్తిగత జీవితం మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఈ లెజెండరీ సింగర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్న అభిమానుల్లో మిగిలిపోయింది. దీనిపై ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లతాజీ సమాధానమిచ్చింది. ‘జీవితంలో ప్రతిదీ దేవుడి నిర్ణయం ఆధారంగానే జరుగుతుంది. ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి. పెళ్లి వద్దనుకునే ఆడపిల్లలు కూడా ఉంటారా? అనే ఈ ప్రశ్న ఓ నలభై ఏళ్ల క్రితం అడిగి ఉంటే నా సమాధానం మరోలా ఉండేదేమో. ఈ వయసులో అలాంటి ఆలోచలకు తావు లేదు.. అంటూ ఆమె సమాధానం చెప్పారు. ఈ ఇంటర్వ్యూ నాటికి లతాజీ వయసు 82 సంవత్సరాలు. అంతేకాకుండా పెళ్లిపై లతాజీ చేసిన మరొక కామెంట్ ఏంటంటే.. కుటుంబంలో పెద్ద అమ్మాయిని కావడం తండ్రి చనిపోయాక 13ఏళ్ల వయసు నుంచే కుటుంబ బాధ్యతని భుజాన వేసుకున్నాను. ఓ దశలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పటికీ ఈ కారణంగా కుదరలేదు’ అని వివరించారు.