PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు నాయుడు ఎందుకీ రాజకీయ నాటకాలు..!

1 min read

సి ఏ ఏ అమలు అయితే పార్టీకి రాజీనామాకు సిద్ధమా శిల్ప

రాష్ట్రంలోని వైసిపి టిడిపి మోడీకి సర్కార్ కు గులాములే

దేశంలో సి ఏ అమలుకు ఎస్ డి పి ఐ పార్టీ వ్యతిరేకం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ బెగ్

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు  ఊసరవెల్లిలా ఎన్ని రంగులు మార్చి ఎన్ని నాటకాలు చేసి తెలుగు రాష్ట్ర ప్రజలకు ముస్లిం మైనార్టీలకు మోసం చేయడం  సరికాదు అని శనివారం నాడు ఓ పత్రిక ప్రకటనలో ఎస్ డి పి ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీర్జా అబ్దుల్లా బేగ్ ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీతో జతకట్టిన చంద్రబాబు నాయుడు డబుల్ రోల్ మాటలు మాట్లాడడం ఆయనకు తగదు అన్నారు గతంలో ఎన్ ఆర్ సి సి ఏ ద్వారా మైనారిటీలు దేశవ్యాప్తంగా  అభద్రతా భావానికి లోనవుతున్నారని మీరు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం లేదా అని వారన్నారు వైసిపి ప్రభుత్వం ఎన్ ఆర్ సి సిఏఏ మద్దతు పలికి రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు  మోసం చేస్తున్నారని చెప్పిన చంద్రబాబు గారు మరి నేడు బిజెపి అలయన్స్ తీసుకొని ఊసరవెల్లిలా రంగులు మార్చి సమర్ధించడం చంద్రబాబు నాయుడు దొంద వైఖరికి నిదర్శనం అన్నారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనారిటీ ముస్లింలు మేల్కొని చంద్రబాబు నాయుడు అసలు రూపాన్ని గమనించాలన్నారు చంద్రబాబు నాయుడు సి ఏ ఏ కు సమర్ధించడం తమ పార్టీ త్రీవంగా ఖండిస్తుందన్నారు గతంలో ముస్లిం మైనారిటీ ఓట్లతో అధికారం పొంది నేడు మీయొక్క స్వార్థంతో కేసుల కు అరెస్టులకు జైలు జీవితానికి భయపడి బిజెపి నల్ల చట్టాలను సమర్థించి రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు దగా చేయడం తగదు అన్నారు రాష్ట్రంలో ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేని బిజెపి పార్టీకి రాబోయే ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంట్ స్థానాలు ఇచ్చినారంటే దాన్ని మతలబు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఎన్ ఆర్ సి సి ఏ కు మద్దతు పలికిన పార్టీలకు సెక్యులర్ వాదులు అందరూ చెప్పాలని ఆయన అన్నారు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు ఇక శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు గతంలో ఆత్మకూరు పట్టణంలో సి ఏ ఏ ఎన్ ఆర్ సి కు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో దేశంలో రాష్ట్రంలో ఎన్ ఆర్ సి సి ఏ అమలు అయితే మొట్టమొదటిగా తాను ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తామని బహిరంగంగా ప్రకటన చేయడం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే అన్నారు  మరి నేడు దేశంలో రాష్ట్రంలో సీఏఏ అమలు అయితే మీరు చేసిన సవాల్ స్వీకరించి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని ఎస్ డి పి ఐ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్లా బేగ్ డిమాండ్ చేశారు.

About Author