PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్లాక్ లో టికెట్ అమ్మే బ‌తుకెందుకు ?.. ప‌వ‌న్ పై నాని ఫైర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఏపీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘సినిమాని ఫ్రీగా చూపిస్తానని ప్రగల్భాలు పలికాడు కదా.. మరి ఈ బ్లాక్ మార్కెట్ బతుకెందుకు?’ అంటూ ఆయన ప్రశ్నించారు. “పవన్ కల్యాణ్‌గారి సినిమా అంట. దానిని తొక్కేస్తున్నారట. అసలు సినిమాని తొక్కడం ఏమిటో నాకు అర్థం కాలేదు. స్నేహితుడు అని చెబుతున్నారు.. స్నేహితుడో కాదు నాకు తెలియదు కానీ.. ఆయన(గౌతమ్ రెడ్డి) మృతి చెందాడని సినిమా వేడుకని ఒక రోజు వాయిదా వేసుకున్నవారు.. ఇంకో రెండు, మూడు రోజులు సినిమాని వాయిదా వేసుకోలేరా? వాయిదా వేసుకోకుండా మీరు సినిమా రిలీజ్ చేసుకున్నప్పుడు.. ప్రస్తుతం ఉన్న రేట్లే పరిగణనలోకి వస్తాయి. అంతేందుకు, పగలదీస్తామని చెప్పి.. సినిమాని ఫ్రీగా చూపిస్తామని చెప్పారు కదా. ఫ్రీ గా చూపించకుండా బ్లాక్‌లో అమ్ముకునే బతుకెందుకు?’’ అని పేర్ని నాని ఈ సమావేశంలో మాట్లాడారు.

                                        

About Author