PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏకసభ్య కమిషన్ ఎందుకు..?

1 min read

– రాజకీయ లబ్ధి కోసమే ఎస్ టి బిల్లు.. టిడిపి వాల్మీకి నాయకులు ఆరోపణ
పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే ఎస్ టి బిల్లును పెట్టారని కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ వాల్మీకి నాయకులు ఆరోపించారు. ఈరోజు వారు తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీ పార్లమెంట్ బిసి సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు (వాల్మీకి ) అధ్యక్షతన రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు నంది మధు, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి సంజీవ లక్ష్మి, పార్లమెంట్ బిసి సెల్ అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ బి రామాంజనేయులు, కల్లూరు మండలం టిడిపి అధ్యక్షులు బి రామాంజనేయులు గార్లతో కలిసి నిర్వహించిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లోని బింటో,ఓరియా వాల్మీకి /బోయల స్థితిగతులను అధ్యయనం చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారి నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ ను సదరు జీవో విడుదలలో ఉన్న అంతర్యమేమిటో రాజకీయ కుట్ర ఏమిటో ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది వాల్మీకి బోయల భవిష్యత్తుకు మరణ శాసనం రాసే విధముగా ఈ వైసిపి ప్రభుత్వం కుట్ర పూరితమైన ఈ జీవోను విడుదల చేసిందని వారు తెలిపారు.
భారత దేశంలోని అన్ని రాష్ట్రాలలో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారు, కానీ మన రాష్ట్రంలో 5జిల్లాలు అయిన విశాఖపట్టణం,విజయనగరం,శ్రీకాకుళం,పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలలో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారు కానీ, మిగిలిన జిల్లాలో మాత్రం బీసీలుగా పరిగణింపబడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన 8 జిల్లాలలో ఎందుకు BC లు గా ఉన్నారు, ఈ ప్రాంతీయ వ్యత్యాసం ఎందుకని ప్రశ్నిస్తూ వెంటనే 8 జిల్లాల్లో కూడా ఎస్టీలుగా పరిగణించాలని వారు విజ్ఞప్తి చేశారు.గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2017 డిసెంబర్ 2వ తేదీ చట్టపరంగా, న్యాయబద్ధంగా,శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపారు. పార్లమెంటులో ప్రధాన మంత్రి గారి టేబుల్ మీద ఈ బిల్లు ఉన్నది. ఈ బిల్లును పార్లమెంట్ లో ఆమోదింప చేయాల్సి ఉండగా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం మరల ఏక సభ్య కమిషన్ ను నియమించి కాలయాపన చేసేందుకు తప్ప మరొకటి కాదని బోయల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేందుకు ఇదే నిదర్శనం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చిత్రసేనుడు, పడిదంపాడు సర్పంచ్ శంకర్ నాయుడు,దేవమాడ సర్పంచ్ బి ఈశ్వరయ్య,మరియు వాల్మీకి సోదరులు హాజరు కావడం జరిగినది.

About Author