NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎందుకు టార్గెట్ చేశారు ?

1 min read

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
నెల్లూరు: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం న‌డుస్తోంద‌ని చంద్రబాబు నాయుడు విమ‌ర్శించారు. మాట‌విన‌ని వారి ఆర్థిక‌మూలాలు దెబ్బతీయాల‌నే మ‌న‌స్తత్వం .. నేడు రాష్ట్రమంతా పాకింద‌ని విమ‌ర్శించారు. దీంట్లో భాగంగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను టార్గెట్ చేశార‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. పెద్ద హీరోల సినిమాల విడుద‌ల స‌మ‌యంలో ప్రత్యేక షోలు వేయ‌డం, తొలిరోజు టికెట్లు పెంచుకోవ‌డం ఆన‌వాయితీ. మ‌రి ప‌వ‌న్ సినిమాకు ఎందుకు అవ‌కాశం ఇవ్వలేద‌ని ప్రశ్నించారు. మిమ్మల్ని ప్రశ్నిస్తార‌ని క‌క్ష పెంచుకున్నారా? అన్నారు. ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తారా?, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హ‌క్కులేదా అని ప్రశ్నించారు.

About Author