జంట హత్యల నిందితుల్ని ఎందుకు అరెస్టు చేయలేదు ?
1 min read
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu. (Photo: IANS)
పల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో జరిగిన జంట హత్యల నిందితుల్ని ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. జూన్ 17న టీడీపీ నాయకులు వడ్డు ప్రతాప్ రెడ్డి, వడ్డు నాగేశ్వరరెడ్డిని వైకాపా గూండాలు దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. వారి సోదరుడు మోమన్ రెడ్డికి నివాళి అర్పించే క్రమంలో స్మశానానికి వెళ్లిన వారిపై దారుణంగా దాడి చేసి హత్య చేశారని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు, దాడులకు పాల్పడే వారికి సమాజంలో చోటు ఉండకూడదన్నారు. తక్షణమే నిందితుల్ని అరెస్టు చేసి సాక్షులకు రక్షణ కల్పించాలని కోరారు.